సరిహద్దులో పెద్దపులి
కౌటాల(సిర్పూర్): కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్దా నది సరిహద్దు అవతలివైపు శుక్రవారం ఉదయం పెద్దపులి కదలికలను చేలల్లో పత్తి తీస్తున్న కూలీలు గమనించారు. భయంతో పరుగులు తీశారు. మహారాష్ట్రలోని దరూర్‌లో ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలను ఆ రాష్ట్ర అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో కౌటాల ఎఫ్‌ఎస్‌వో తులసీదాస్ తాటిపల్లిలోని వార్దా నది ప్రాంతాన్ని సందర్శించారు. మండలంలోకి పులి రాలేదని స్పష్టం చేశారు. చేలల్లో రాత్రివరకు ఉండవద్దని, గుంపులుగా తిరగాలని సూచించారు. సరిహద్దులో పెద్ద పులి సంచరిస్తుండటంతో నది పరీవాహక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


