‘మేజర్‌’పై ఫోకస్‌..! | - | Sakshi
Sakshi News home page

‘మేజర్‌’పై ఫోకస్‌..!

Dec 5 2025 6:09 AM | Updated on Dec 5 2025 6:09 AM

‘మేజర

‘మేజర్‌’పై ఫోకస్‌..!

● పెద్ద పంచాయతీలపై పార్టీల దృష్టి ● ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నం ● చింతలమానెపల్లి అభివృద్ధి చెందుతున్న మండలం. ఇక్కడ డబ్బా, చింతలమానెపల్లి, గూడెం గ్రామాల నుంచి మహారాష్ట్రకు రహదారి గుండా రవాణా జరుగుతోంది. గూడెంలోని మద్యం దుకాణానికి జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు రావడం గమనార్హం. డబ్బా, రవీంద్రనగర్‌, చింతలమానెపల్లి, గూడెం గ్రామాల్లో అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ● బెజ్జూర్‌ గ్రామీణ మండలమైనా రాజకీయంగా ప్రభావం ఎక్కువ. సిర్పూర్‌(టి) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఈ ప్రాంతానికి చెందిన వారే.. బెజ్జూర్‌, సలుగుపల్లిలో వారసంతలతో రెవెన్యూ పరంగా పోటీ నెలకొంది. ● పెంచికల్‌పేట్‌ మండలంలో జిల్లాలోనే తక్కువ పంచాయతీలు ఉన్నాయి. పెంచికల్‌పేట్‌ వాణిజ్యపరంగా కీలక ప్రాంతం. భారీస్థాయిలో లా వాదేవీలు జరుగుతాయి. కాగజ్‌నగర్‌ పట్టణాని కి సమీపంలో ఉన్న షెడ్వాయి సైతం కీలకంగా మారింది. త్వరలో షెడ్వాయిలో ప్రభుత్వం భారీ విద్యా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనుంది. ● దహెగాం మండలంలో మండల కేంద్రంతోపాటు ఐనం, బీబ్రా, కొంచవెల్లి పెద్ద గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి. పంటలతో ఇక్కడి భూములు భారీ ధర పలుకుతాయి. ఆయా పంచాయతీల్లో గెలుపు గుర్రాలను నిలబెట్టేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ● కౌటాల మండలం రాష్ట్రస్థాయిలో కీలకమైంది. ఇక్కడి వారసంత ఏటా రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సాధిస్తోంది. కంకర క్వారీలు ఉన్న ముత్తంపేట గ్రామ పంచాయతీలో జనాభా కూడా ఎక్కువే. వీటితో పాటు సరిహద్దు గ్రామం గుండాయిపేటలో పోటీ ఆసక్తిగా మారింది. ● సిర్పూర్‌(టి) నియోజకవర్గంలోనే పెద్ద గ్రామ పంచాయతీ. జనాభాతోపాటు మహారాష్ట్ర సరిహద్దు మండలం కావడంతో రవాణాకు కీలకం. వారసంత, గురుకులాలు, వాణిజ్య సముదాయాలతో ఆదాయం మెరుగ్గా ఉంది. లోనవెల్లి సైతం మరో పెద్ద పంచాయతీ. ● కాగజ్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రం. ఈజ్‌గాం, నజృల్‌నగర్‌, నామానగర్‌, చింతగూడ, కోర్సిని పట్టణానికి ఆనుకుని ఉన్నాయి. రియల్‌ఎస్టేట్‌ రంగంతో పాటు ప్రధాన రహదారులు అభివృద్ధి చెందడంతో అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. పంచాయతీల్లో గెలిస్తే పట్టణంలో పట్టు పెంచుకోవచ్చనే అభిప్రాయం ఉంది. భట్టుపల్లిలోనూ పోటీ తీవ్రంగా ఉంది.

చింతలమానెపల్లి(సిర్పూర్‌): పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. జిల్లాలోని 335 పంచాయతీలు, 2,874 పంచాయతీలకు డిసెంబర్‌ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను బలపరుస్తూ బరిలో దించుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని మేజర్‌ పంచాయతీలపై దృష్టి సారించాయి. జనాభా, రెవెన్యూ అధికంగా ఉండే చోట తమ ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. 2019లో అప్పటి ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఎన్నికల్లో చిన్న జీపీలతో పోలిస్తే పెద్ద పంచాయతీల్లోనే పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వార సంతలు, ఆదాయ మార్గాలు, సమాజంలో పలుకుబడి తదితర అంశాలను లెక్కలు వేసుకుంటున్నారు.

పలు అంశాలు కీలకం..

ప్రధాన పంచాయతీల్లో తాము బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీల ప్రధాన నాయకులు ఎత్తుగడలు వేస్తున్నారు. మేజర్‌ పంచాయతీల్లో సత్తా చాటితే రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ విజయావకాశాలు మెరుగుపర్చుకోవచ్చని భావిస్తున్నారు. అలాగే శాసనసభ ఎన్నికలకు వీటిని ప్రణాళికలో భాగం చేసుకుంటున్నారు. పలు మండలాల్లో పరిస్థితి ఈ విధంగా ఉంది.

‘మేజర్‌’పై ఫోకస్‌..!1
1/1

‘మేజర్‌’పై ఫోకస్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement