ఏకగ్రీవాల జోరు!
కెరమెరి(ఆసిఫాబాద్): మొదటి విడత ఎన్నికల్లో భా గంగా నామినేషన్ల ఉపసంహరణ, గుర్తుల కేటా యింపు పూర్తికాగా అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపారు. మొదటి విడతలో భాగంగా కెరమెరి, వాంకిడి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ) మండలాల్లోని 114 గ్రామ పంచాయతీలు, 944 వార్డులకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏడు పంచాయతీలు, 576 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగితా 107 పంచాయతీల్లో 396 మంది సర్పంచ్ అభ్యర్థులు, 368 వార్డుల్లో 855 మంది పోటీల్లో ఉన్నారు.
ఏకతాటిపై ఉండి..
ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట్ల కూడా ప్రజలు ఏకతాటిపై ఉండి పోటీ లేకుండా నాయకులను ఎన్నుకున్నారు. కెరమెరి మండలంలో ధనోరా, బాబేఝరి, వాంకిడి మండలంలో ధాబా, నవేగాం, వాడిగూడ, లింగాపూర్ మండలంలో మామడ్‌పల్లి, కంచన్‌పల్లి గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నవంబర్ 27 నుంచి ఈ నెల 2 వరకు కొనసాగిన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియల తర్వాత ఆయా పంచాయతీల్లో ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. దీంతో వారు పోటీ లేకుండానే విజేతలుగా మిగిలారు. ఎన్నికల అధికారులు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
మిగితాచోట పోటాపోటీ
ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులకు చెందిన బ్యాలెట్ పేప ర్లు, కరపత్రాలతో అవగాహన కల్పిస్తున్నారు. తమ ను గెలిపిస్తే చేపట్టే పనులను ప్రజలకు వివరిస్తూ వాగ్దానాలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై దృష్టి సారిస్తామని హామీలు గుప్పిస్తున్నారు.
మొదటి విడత పంచాయతీల వివరాలు
మండలం జీపీలు ఏకగ్రీవం బరిలో వార్డులు ఏకగ్రీవం బరిలో
ఉన్నవారు ఉన్నవారు
కెరమెరి 31 2 111 250 132 222
వాంకిడి 28 3 88 236 112 383
జైనూర్ 26 0 104 222 167 109
లింగాపూర్ 14 2 42 112 67 85
సిర్పూర్(యూ) 15 0 51 124 98 56
మొత్తం 114 7 396 944 576 855


