అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న వంతెనలు, కల్వర్టులు, రహదారులు, అదనపు గదులు, నూతన భవనాలు, పంచాయతీ కార్యాలయాలు, ప్రధాన మంత్రి జన్‌మన్ జుగా పథకం కింద చేపట్టిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులు వేగవంతం చేయాలని, 15వ ఆర్థిక ప్రణాళిక కింద మంజూరైన నిధులను ఎంపిక చేసిన పనులకు మాత్రమే వినియోగించాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, డీటీడీవో రమాదేవి, అన్ని విభాగాల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


