సంచులు మార్చి.. మళ్లీ అప్పగించి
ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ క్రాస్‌రోడ్డు వద్ద ఓ రైస్ మిల్లులో సర్కారు పంపిణీ చేసిన బియ్యం బస్తాలనే నేరుగా మిల్లులోకి తరలిస్తున్నారు. అక్కడ ప్రభుత్వం పంపిణీ చేసిన గన్నీ సంచి నుంచి తమ వద్ద ఉన్న గన్నీ సంచుల్లోకి నింపేస్తున్నారు. వందల క్వింటాళ్ల కొద్దీ రేషన్ షాపుల నుంచే నేరుగా మిల్లులకు రావడం గమనార్హం. సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద అప్పగించాల్సిన బియ్యాన్ని, సర్కారుకు బకా యి ఉన్న మిల్లర్లు వడ్లను గతంలోనే అమ్మేసుకున్నారు. చాలాచోట్ల సర్కారు అప్పగించిన వడ్లు లేకపోవడంతో జరిమానాలు, కేసులకు భయప డి రీసైక్లింగ్‌ను ఎంచుకున్నారు. మిల్లులో ధా న్యం మరాడించకుండానే నేరుగా రేషన్ బియ్య మే కొనుగోలు చేసి సీఎంఆర్ కింద బియ్యం పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తున్నారు. గోదాంల వద్ద తనిఖీలు చేసే అధికారులను మేనేజ్ చేసుకుంటూ బియ్యం పాస్ చేయించుకుంటున్నారు. కాగజ్‌నగర్ పరిధిలో రేషన్ బియ్యం మిల్లులోనే దొరికిన ఘటనలు ఉన్నాయి.


