ఆసిఫాబాద్‌రూరల్: గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారని డీఎస్‌వో షేకు తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల ఆవరణలో గురువారం పీడీ మీనారెడ్డి, కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్, హెచ్‌ఎం జంగుతో కలిసి క్రీడాకారులను అభినందించారు. డీఎస్‌వో మాట్లాడుతూ ఆదిలా బాద్‌లో ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన అండర్– 17 జోనల్‌స్థాయి బాలికల హ్యాండ్‌బాల్ పోటీల్లో ముత్తుబాయి, అనిత, పల్లవి, అమూల్య ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. వీరు ఈ నెల 7 నుంచి 9 వరకు నారాయణపేటలో జరిగే పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.


