ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి 2025– 26 వానాకాలం సీజన్ వరిధాన్యం కొనుగోళ్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ కేంద్రానికి మండల స్థాయి అధి కారిని పర్యవేక్షకులుగా నియమిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీఆర్‌డీవో దత్తారావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
నేడు వందేమాతరం సామూహిక గీతాలాపన
కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ఉదయం 11 గంటలకు వందేమాతరం సామూహిక గీతాలాపన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే బంకించంద్ర చటర్జీ వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గీతాలాపన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభు త్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.


