బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్: బాల్య వివాహాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామ ని డీసీపీవో మహేశ్ తెలిపారు. మండలంలో ని నంబాలలో గురువారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ బాల్య వివాహం చిన్నారుల భవిష్యత్తును దెబ్బతీసే తీవ్రమైన సామాజిక సమస్య అని అన్నారు. మైనర్లకు పెళ్లి చేస్తే చట్టప్రకారం చ ర్యలు చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహం జరిగితే వెంటనే 112, 1098 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మౌనిక, ప్రత్యేక అధికారి వెంకటేశ్, హెచ్‌ఎం వసంతరావు, కౌన్సిలర్లు చంద్రశేఖర్, రాణి పాల్గొన్నారు.


