‘తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలి’
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటా లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూప్‌నార్ రమేశ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూ లే విగ్రహం వద్ద గురువారం మౌన దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ డిసెంబర్ మొదటి వారంలో బీసీల చలో ఢిల్లీ.. పార్లమెంట్ ముట్టడి చేపట్టనున్నట్లు తెలిపారు. జనవరి నాలు గో వారంలో లక్షమందితో వేల వృత్తులు.. కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మౌన దీక్షకు ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు కేశవ్‌రావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ప్రణయ్, నాయకులు, సభ్యులు పురుషోత్తం, బాలేశ్, జక్కన్న, విశాల్, రమేశ్, శ్రీనివాస్, మీరాజ్, రవీందర్, నారాయణ పాల్గొన్నారు.


