ఏఐ బోధన.. హుషారుగా సాధన | - | Sakshi
Sakshi News home page

ఏఐ బోధన.. హుషారుగా సాధన

Nov 6 2025 8:20 AM | Updated on Nov 6 2025 8:20 AM

ఏఐ బోధన.. హుషారుగా సాధన

ఏఐ బోధన.. హుషారుగా సాధన

విద్యార్థుల్లో పెరుగుతున్న కంప్యూటర్‌ పరిజ్ఞానం జిల్లాలోని 14 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు మరిన్ని స్కూళ్లకు విస్తరిస్తే ప్రయోజనం

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో ఏఐ బోధన సత్ఫలితాలను ఇస్తోంది. విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకుంటున్నారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం పెంచుకుంటూ హుషారుగా సాధన చేస్తున్నారు. అలాగే ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఆధారంగా బోధన సాగుతున్న పాఠశాలల్లో హాజరు సైతం మెరుగుపడింది. సత్ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ తరగతులు అమలు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

సులభంగా నేర్చుకునేలా..

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ బోధన కోసం ప్రభుత్వం జిల్లాలో 14 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయగా, అందులోని 146 మంది విద్యార్థులకు ఏఐ తరగతులు బోధిస్తున్నారు. చదువులో వెనుకబడిన వారిని దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలు సులభంగా నేర్చుకొనేలా క్లాసులు నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్‌ ద్వారా గణితం, సైన్స్‌, తెలుగు ఇతర సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులను ఆకట్టుకునేలా బొమ్మలతో పాఠాలు చెబుతున్నారు. 3, 4, 5వ తరగతులకు చెందిన విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుపై 20 నిమిషాలపాటు తరగతులు కొనసాగుతున్నాయి. ఏఐ క్లాసులతో డ్రాపౌట్స్‌ తగ్గగా, ఇటీవల అధికారులు ‘నో మోర్‌ డ్రాపౌట్స్‌’ పేరిట డాక్యుమెంటరీ సైతం తీశారు.

ఇంటర్నెట్‌ ఇబ్బందులు

పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో ఏఐ తరగతుల నిర్వహణకు ఇంటర్నెట్‌ సమస్యతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కనెక్షన్లు లేకపోవడంతో కొన్నిచోట్ల మొబైల్‌ ఫోన్లను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతోపాటు ఎక్స్‌టెప్‌ సంస్థ ప్రతినిధులు నిత్యం జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. గతంలో ప్రాథమిక విద్య బోధనను మెరుగుపర్చేందుకు అపెప్‌, డిపెప్‌, క్లిప్‌, క్లాప్‌, క్యూఐపీ, ఎల్‌ఈపీ, ట్రిపుల్‌ ఆర్‌ వంటి కార్యక్రమాలను అమలు చేశారు. అవి ఆశించిన మేర ఫలితాలు ఇవ్వలేదు. ఏఐ తరగతులు సత్ఫలితాలను ఇస్తుండటంతో మరిన్ని స్కూళ్లకు విస్తరిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

ఏఐ తరగతులు అమలవుతున్న పాఠశాలలు

మండలం పాఠశాల విద్యార్థులు

బెజ్జూర్‌ ఎంపీపీఎస్‌ సలుగుపల్లి 10

కెరమెరి ఎంపీపీఎస్‌ గోయగాం 10

రెబ్బెన ఎంపీపీఎస్‌ తక్కలపల్లి 11

వాంకిడి ఎంపీపీఎస్‌ ఖిర్డి 10

పెంచికల్‌పేట్‌ ఎంపీపీఎస్‌ చేడ్వాయి 10

కౌటాల ఎంపీపీఎస్‌ బోదంపల్లి 15

కాగజ్‌నగర్‌ ఎంపీపీఎస్‌ ఆరెగూడ 10

కాగజ్‌నగర్‌ ఎంపీపీఎస్‌ గన్నారం 10

ఆసిఫాబాద్‌ ఎంపీయూపీఎస్‌ చిర్రకుంట 10

ఆసిఫాబాద్‌ ఎంపీయూపీఎస్‌ అడ 10

ఆసిఫాబాద్‌ ఎంపీయూపీఎస్‌ తేలిగూడ 10

తిర్యాణి పీఎంశ్రీ ఎంపీయూపీఎస్‌ గంభీరావ్‌పేట 10

కౌటాల ఎంపీపీఎస్‌ కౌటాల 10

పెంచికల్‌పేట్‌ ఎంపీపీఎస్‌ సంజీవ్‌నగర్‌ 10

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement