‘వర్క్‌షాప్ మూసివేత ఆలోచన సరికాదు’
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియా వర్క్‌షాప్‌ను మూసివేసే ఆలోచన సరికాదని హెచ్‌ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు అన్నారు. బుధవారం గోలేటి టౌన్‌షిప్‌లో జీఎం విజయ భాస్కర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఏరియాలో దాదాపు వందేళ్లకు సరిపడా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, దానిని దృష్టిలో ఉంచుకుని వర్క్‌షాప్‌నకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూపర్‌వైజర్, టెక్నీషియన్లను డిప్యూటేషన్‌పై ఖైరిగూర ఓసీపీకి బదిలీ చేయడంతో వర్క్‌షాప్‌ను మూసివేస్తారనే అనుమానం కలుగుతోందన్నారు. ఖైరిగూర ఓసీపీలో మ్యాన్‌పవర్‌ను పెంచాల్సిన గుర్తింపు సంఘం నాయకులు.. వర్క్‌షాప్‌లో పనిచేసే టెక్నీషియన్లను డిప్యూటేషన్‌పై పంపించి వర్క్‌షాప్‌ను మూసివేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బ్రాంచి కార్యదర్శి శివారెడ్డి, ఏరియా ఆర్గనైజర్ ఎస్‌కే ఇనూస్, నాయకులు రాజశేఖర్, సంతోష్ పాల్గొన్నారు.


