
ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించాలి
దహెగాం(సిర్పూర్): దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన తలాండి శ్రావణిని నిండు గర్భిణి అని చూడకుండా హత్య చేసిన శివార్ల సత్తయ్యను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రవేశపెట్టి త్వరగా శిక్షించాలని గోండ్వాన కోయ ఆదివాసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోయం చిన్నన్న డిమాండ్ చేశారు. గెర్రె గ్రామంలో శ్రావణి మృతదేహానికి ఆదివారం నివాళులర్పించారు. నిందితుడిని కఠినంగా శిక్షించా లని అక్కడే ఉన్న కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్‌కి వినతిపత్రం అందించారు. చిన్నన్న మాట్లాడుతూ ఇది ముమ్మూటికి కులోన్మాద హత్య అని అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశా రు. కుల వివక్షను నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమురం మాంతయ్య, ఆదివాసీ సంఘాల నాయకులు ఓం ప్రకాశ్, కోట సతీశ్ తదితరులు పాల్గొన్నారు.