
దరఖాస్తు గడువు పొడిగింపు
ఆసిఫాబాద్: బీసీ బంద్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది. ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో లక్కీడ్రా నిర్వహించనున్నారు. గత నెల 26న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రి య ప్రారంభమైంది. మొదట మందకొడిగా దరఖా స్తులు రాగా నాలుగు రోజులుగా ఊపందుకున్నా యి. శనివారం జిల్లాలోని వ్యాపారులు అర్ధరాత్రి వరకు దరఖాస్తులు సమర్పించారు. ఈ నెల 15న 47 దరఖాస్తులు, 16న 46, 17న 165, 18న 242 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల సంఖ్య 622కు చేరింది. ప్రభుత్వానికి రూ.18.66 కోట్ల ఆ దాయం సమకూరింది. అత్యధికంగా గూడెం షాపునకు 63 దరఖాస్తులు రాగా, వాంకిడి 007 దుకా ణానికి 45, వాంకిడి 008 దుకాణానికి 43, గోయగాం(తిర్యాణి) 46, గోయగాం(కెరమెరి) 46, దహెగాం షాపునకు 44 దరఖాస్తులు వచ్చాయి. రెబ్బెన, గోలేటి, జైనూర్(030, 031), సిర్పూర్(యూ), కాగజ్‌నగర్(014, 015, 016, 018), కౌటాల(023) షాపులకు మాత్రం పదిలోపే దరఖాస్తులు వచ్చాయి. కాగా, జిల్లాలోని మద్యం దుకాణాలకు 2019లో 763 దరఖాస్తులు రాగా, 2021లో 643, 2023లో 1020 దరఖాస్తులు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గినా 90 శాతం వరకు ఆదాయం వచ్చింది.
లక్కీడ్రాకు ఏర్పాట్లు
మద్యం దుకాణాల దరఖాస్తు గడువు ఈ నెల 23వరకు పెంచిన నేపథ్యంలో ఈ నెల 27న ఉదయం 10.30 గంటలకు లక్కీడ్రా నిర్వహించేందుకు ఏర్పా టు చేస్తున్నామని జిల్లా ఎకై ్సజ్ అధికారి జ్యోతికిరణ్ తెలిపారు. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటల కు కలెక్టరేట్‌కు చేరుకోవాలి. దరఖాస్తుతోపాటు ఎక్సై జ్ శాఖ అధికారులు ఇచ్చిన రశీదును తీసుకురావా లని అధికారులు సూచించారు. దరఖాస్తుదారు రాలేని పక్షంలో ఆథరైజేషన్ లెటర్ ఉన్న వ్యక్తులను అనుమతిస్తారు. ఇందుకు సంబంధించిన ఎంట్రీ పాసులను అందజేస్తారు. లక్కీడ్రా నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాగునీరు, జనరేటర్, మైక్ సెట్ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. ఎకై ్సజ్ శాఖ విడుదల చేసిన గెజిట్ ప్రకారం సీరియల్ నంబర్ 1 నుంచి లక్కీడ్రా తీయనున్నారు. మధ్యాహ్నం వరకు దుకాణాల కేటాయింపు పూర్తి కానుంది.