
హాస్టల్ వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలి
పాతమంచిర్యాల: గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్ వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆదివారం జిల్లా కేంద్రంలోని మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మంత్రి పీఏ రాకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టేకం ప్రభాకర్ మాట్లాడుతూ జీవో 69 రద్దు చేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యక్షుడు వెలిశాల కృష్ణమూర్తి, యూనియన్ జిల్లా కార్యదర్శి శ్యాంరావు, కోశాధికారి రాంబాయి, ఉపాధ్యక్షురాలు హీరాబాయి, నాయకులు తార, జంగుదేవి, బాపురావు, అరిగెల కోటయ్య, శ్యామల, పద్మ, సముద్రబాయి, తదితరులు పాల్గొన్నారు.