
వెలుగుల పండుగ
ఆసిఫాబాద్‌అర్బన్: జ్ఞానానికి.. శుభానికి ప్రతీక దీపం. అందుకే ప్రతీ శుభకార్యాన్ని జ్యోతి ప్రజ్వలనతోనే ప్రారంభిస్తాం. అజ్ఞానమనే చీకటిని తరిమి జీవితాలను జ్ఞానకాంతితో నింపే మహోత్సవమే దీ పావళి. ఆశ్వయుజ బహుళ అమావాస్య సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా ఈ వెలుగుల పండుగ జరుపుకోన్నారు. ధనలక్ష్మీ పూజలు, బొమ్మల కొలువులు, బంగారం కొనుగోళ్లతో సందడి నెలకొంది. ఇళ్లతోపాటు వ్యాపార సముదాయాల్లో లక్ష్మీదేవి పూజలు, కేదారీశ్వర నోములు నిర్వహించనున్నారు. ఇంటి ఎదుట మామిడి తోరణాలు, పూలదండలు, రంగురంగుల విద్యుత్ లైట్లు, దీపపు ప్రమిదలతో అలంకరించనున్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రంతోపాటు కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రధాన మార్కెట్లు ఆదివారం సందడిగా మారాయి. గృహాల అలంకరణకు అవసరమైన సామగ్రిని కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపారు. ధనలక్ష్మీ పూజలు, నోములు, వ్రతాలు, టపాసుల కొనుగోలు చేశారు.
పండుగ నేపథ్యం...
ద్వాపర యుగంలో ప్రాజ్యోతిష్టపురాన్ని రాజధాని గా చేసుకొని పరిపాలించిన నరకాసురుడు దేవ, మానవ జాతిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవా డు. ధర్మానికి భంగం కలిగించే అతని చర్యలను సహించలేని భూమాత, దేవతలు, ప్రజలు శ్రీకృష్ణుడికి విన్నవించుకుంటారు. అప్పుడు కృష్ణుడు సత్యభామతో కలిసి ఆశ్వయుజ చతుర్దశి రోజు నరకాసురుడిని అంతం చేస్తాడు. ఇదే ’నరక చతుర్దశి’గా మారింది. నరకాసుర వధ అనంతరం నగరానికి తిరిగి వచ్చిన సత్యభామ, కృష్ణుడికి అమావాస్య నాడు ప్రజలు దీపాలు వెలిగించి మంగళ హారతులతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
దీపాల వెలుగులు.. బాణాసంచా మోతలు
దీపావళి సందర్భంగా వివిధ ఆకృతుల్లో ఉన్న ప్ర మిదలతో వరుసగా నాలుగు రోజులపాటు దీపాలు వెలిగిస్తారు. అమావాస్య తిథి లక్ష్మీదేవికి ఇష్టం కావడంతో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని ఆహ్వా నిస్తే ధనలక్ష్మీ కృప ఉంటుందని నమ్ముతారు. అనంతరం వివిధ రకాల బాణాసంచాను కాల్చి చిన్నాపెద్దా తేడా లేకుండా ఆనందంగా గడుపుతారు.
ఆనందోత్సహాల పండుగ
ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజును నరక చతుర్దశిగా పిలుస్తారు. దుర్మార్గుడి పేరుతో ఏర్పడిన ప్రత్యేకత నరక చతుర్దశికి ఉంది. సీ్త్రలతో అమర్యాదగా ప్రవర్తించే వారికి శిక్ష తప్పదనే సందేశం ఈ పండుగ ఇస్తుంది. యుద్ధంలో నరకాసురిడిని సంహరించడంతో రాక్షస పీడ వదిలిందని ప్రజలు ఆనందోత్సహాలతో దీపావళి జరుపుకొంటారు.
– ఒజ్జల శిరీశ్‌శర్మ, పురోహితులు

వెలుగుల పండుగ

వెలుగుల పండుగ

వెలుగుల పండుగ