
పులి జాడ కోసం గస్తీ
బెజ్జూర్(సిర్పూర్): బెజ్జూర్ రేంజ్ పరిధిలోని మత్తడివాగు సమీపంలో బీట్ అధికారులు గోపాల్, స్రవంతి టైగర్ ట్రాకర్ సిబ్బందితో కలిసి పెద్దపులి ఆనవాళ్ల కోసం గాలించారు. వివిధ మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆనవాళ్లు గుర్తించేందుకు గస్తీ తిరుగుతున్నామని వారు తెలిపారు. ఇప్పటివరకు బెజ్జూర్ రేంజ్ పరిధిలోకి పెద్దపులి రాలేదని స్పష్టం చేశారు. మత్తడివాగు సమీపంలో చిరుతపులి తిరుగుతున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.