
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: రైతులు, వ్యాపారులు రుణాలు సద్వినియో గం చేసుకోవాలని స హకార బ్యాంకు ఉమ్మడి జిల్లా సీఈవో సూర్యప్రకాశ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని సహకార బ్యాంకులో బుధవారం జిల్లాలోని సహకార బ్యాంకుల మేనేజర్లు, ఫీల్డ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఎన్ని రు ణాలు మంజూరు చేశారు.. ఎంత వరకు రికవరీ చేశారు.. తదితర వివరాలు అడిగి తెలు సుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సహకార బ్యాంకుల ద్వారా పంటలు, వ్యవసా య పరికరాలతోపాటు వ్యాపార, హౌజింగ్, విద్య తదితర అవసరాలకు రుణాలు అంది స్తామని తెలిపారు.