
● మద్యం దుకాణాలకు మందకొడిగా దరఖాస్తులు ● జిల్లాలోని 32
ఆసిఫాబాద్: జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తు గడువు మరో రెండురోజులు మాత్రమే మిగిలిగింది. గతేడాదితో పోల్చితే ఈసారి టెండర్లకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సెప్టెంబర్ 26 నుంచి జిల్లాలోని 15 మండలాల్లో 32 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రిజర్వేషన్ల ప్రాతిపదికన గౌడ కులస్తులకు 2, ఎస్సీలకు 4, ఎస్టీలకు ఒకటి, ఏజెన్సీ ప్రాంతంలో నాలుగు దుకాణాలను ఎస్టీలకు కేటాయించారు. జనరల్ కేటగిరీలో 21 దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తు రుసుం రూ.3 లక్షలుగా నిర్ధారించారు. దరఖాస్తు రుసుం పెరగడంతో కొత్త వ్యాపారులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో చాలా మంది గ్రూపులుగా ఏర్పడి దరఖాస్తులు సమర్పిస్తున్నట్లు సమాచారం.
166 దరఖాస్తులు.. రూ.4.98 కోట్ల ఆదాయం
జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు ఇప్పటివరకు 166 రాగా, ప్రభుత్వానికి రూ.4.98 కోట్ల ఆదాయం సమకూరింది. బుధవారం ఒక్కోరోజే 47 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్ డివిజన్‌లో 120 దరఖాస్తులు రాగా, కాగజ్‌నగర్‌లో 46 మాత్రమే వచ్చాయి. 11 దుకాణాలకు ఇప్పటివరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దరఖాస్తుల్లో ఆసిఫాబాద్ డివిజన్ ముందుండగా, కాగజ్‌నగర్ వెనుకబడింది. గతంలో దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు ఉండగా, తాజాగా రూ.3 లక్షలుగా ఖరారు చేశారు. 2021లో నిర్వహించిన మద్యం టెండర్లలో జిల్లావ్యాప్తంగా 26 మద్యం దుకాణాలకు 763 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.15.26 కోట్ల ఆదాయం సమకూరింది. 2023లో నిర్వహించిన టెండర్లలో 32 మద్యం దుకాణాలకు 1020 దరఖాస్తులు రాగా, రూ.20.40 కోట్ల ఆదాయం వచ్చింది. తాజా పరిస్థితులు చూస్తుంటే ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే చివరి రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
షాపు దరఖాస్తులు
ఆసిఫాబాద్(001) 6
ఆసిఫాబాద్(002) 7
ఆసిఫాబాద్(003) 7
ఆసిఫాబాద్(004) 3
ఆసిఫాబాద్(005) 8
ఆసిఫాబాద్(006) 3
వాంకిడి(007) 27
వాంకిడి(008) 21
రెబ్బెన(009) 0
గోలేటి(010) 0
గంగాపూర్(011) 1
విజయనగరం కాలనీ,
గోయగాం(012) 16
గోయగాం, మం.కెరమెరి(013) 22
కాగజ్‌నగర్(014) 0
కాగజ్‌నగర్(015) 0
కాగజ్‌నగర్(016) 2
కాగజ్‌నగర్(017) 4
కాగజ్‌నగర్(018) 1
కాగజ్‌నగర్(019) 1
సిర్పూర్– టి(020) 0
నజ్రూల్‌నగర్(021) 2
రవీంద్రనగర్(022) 0
కౌటాల(023) 0
కౌటాల(024) 25
బెజ్జూర్(025) 8
పెంచికల్‌పేట్(026) 0
దహెగాం(027) 13
గూడెం(028) 14
చింతనమానెపల్లి(029) 0
జైనూర్(030) 0
జైనూర్(031) 1
సిర్పూర్–యూ(032) 0
జిల్లాలో షాపుల వారీగా దరఖాస్తులు
18 వరకు గడువు
మద్యం దుకాణాలకు ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో అందించాలి. కొత్త మద్యం పాలసీ ప్రకారం ఒకరు ఎన్ని దుకాణాలకై నా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే లక్కీడ్రాలో ఎన్ని దుకాణాలైనా పొందవచ్చు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే చేతుల మీదుగా లక్కీడ్రా ద్వారా షాపులు కేటాయించనున్నారు. దుకాణాలు పొందిన వారు ఆరు విడతల్లో ట్యాక్స్ చెల్లించాలి.

● మద్యం దుకాణాలకు మందకొడిగా దరఖాస్తులు ● జిల్లాలోని 32