
క్రీడలతో స్నేహభావం
రెబ్బెన(ఆసిఫాబాద్): క్రీడలతో వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందని బెల్లంపల్లి ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి అన్నారు. 92వ డబ్ల్యూపీఎస్ వార్షిక క్రీడల్లో భాగంగా శుక్రవారం గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నియర్ బై బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల ఉద్యోగ క్రీడాకారులు సమష్టిగా రాణించి కోల్ ఇండియా పోటీల్లో పతకాలు సాధించాలని అన్నారు. సీనియ ర్ క్రీడాకారుల నుంచి అవసరమైన సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకుడు సంగెం ప్రకాశ్‌రావు, ఏఐటీయూసీ నాయకుడు జూపాక రాజేశ్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అన్వేశ్, జనరల్ కెప్టెన్ కిరణ్, పీఈటీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.