
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
ప్రత్యేక బృందాల ఏర్పాటుతో ఇప్పుడు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటున్నాం. జట్టు సహకారంతో పనిచేయడం ఆసక్తికరంగా ఉంది. బాధ్యతగా ఉండటం అలవాటు చేసుకుంటున్నాం. చిన్న చిన్న పనులు విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా మాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
– రాజేశ్, 9వ తరగతి, కెరమెరి
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
విద్యార్థుల బంగారు భవిత కు చదువు ఒక్కటే ప్రామాణికం కాదు. అన్ని అంశాల్లో విషయ పరిజ్ఞానం అవసరం. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించుకోవడం అవసరం. ఇందుకోసమే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం.
– ఉప్పులేటి శ్రీనివాస్,
విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది