
పర్యటించి.. సూచనలు చేసి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో శుక్రవారం జీఎం సీహెచ్‌పీ కార్పొరేట్ రామ్మూర్తి పర్యటించారు. ఏరియా అధికారులతో కలిసి గోలేటి సీహెచ్‌పీని సందర్శించా రు. బొగ్గు రవాణా, నాణ్యత విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. వినియోగదారులకు నాణ్యమై న బొగ్గును సకాలంలో అందించినప్పుడే సింగరేణి సంస్థకు ఆదాయం పెరుగుతుందన్నా రు. అనంతరం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. ఉత్పత్తి, ఉ త్పాదకత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి ఆయన ను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందించా రు. కార్యక్రమాల్లో ఎస్వోటూజీఎం రాజమ ల్లు, ఏరియా ఇంజినీరు కృష్ణమూర్తి, డీజీఎం ఉజ్వల్‌కుమార్, ప్రాజెక్టు ఇంజినీరు వీరన్న, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.