
ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రా థమిక విద్యను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మండలంలోని చిర్రకుంట, రింగన్‌గూడ ప్రభుత్వ పాఠశాలలను బుధవారం సందర్శించారు. వంట, తరగతి గదులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన బోధన చేయాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఫౌండేషన్, లిటరసీ అండ్ న్యూమరసీ లో విద్యార్థులకు ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానంపై అందిస్తున్న శిక్షణ వివరాలు అడి గి తెలుసుకున్నారు. ఏఐ బోధనను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ అకాడమిక్ మా నిటరింగ్ అధికారి శ్రీనివాస్, ఎంఈవో సుభాష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.