
నాణ్యమైన భోజనం అందించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ● ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ఆసిఫాబాద్‌రూరల్: వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలలను బుధవారం సందర్శించారు. వంటలు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. బోధన సమయంలో ఉపాధ్యాయులు స్టాఫ్ రూంలో కాలక్షేపం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలనలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పీవో మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు.