
‘సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె’
ఆసిఫాబాద్‌రూరల్: గిరిజన హాస్టల్ డెయిలీవే జ్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించే వర కు సమ్మె కొనసాగుతుందని మధ్యాహ్న భోజ న కార్మికుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేస్తున్న ఽసమ్మె ఆది వారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ హాస్టళ్లలో పని చేస్తున్న వర్కర్లు గత 30 ఏళ్ల నుంచి చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏఐటీయూసీ నాయకులు టీకానంద్, చిరంజీవి, వర్కర్లు గంగుబా యి, జంగుబాయి, రాధాబాయి, లక్ష్మి, సదాశివ్, సంతోష్, రమేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.