
‘ఫొటో ఎక్స్‌పో’ పోస్టర్ ఆవిష్కరణ
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు నివాసంలో ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫొటో ఎక్స్‌పో పోస్టర్లను ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక పరికరాలపై ఫొటోగ్రాఫర్స్ అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫొటో, వీడియో గ్రాఫర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు సమీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలి సతీశ్, కోశాధికారి రాచర్ల వినయ్, కాగజ్‌నగర్ మండల అధ్యక్షుడు అనుమల్ల రాధాకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి కుందారపు రాజు, కోశాధికారి నారాయణ, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.