
శిక్షణ అభ్యర్థులకు పరీక్షలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఖాదీ గ్రామోద్యోగ్ ఆధ్వర్యంలో వృత్తి విద్య శిక్షణ పొందిన అభ్యర్థులకు గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్ క్లబ్‌లో సోమవారం రాత పరీక్షలు నిర్వహించారు. ఏరియాలోని గోలేటి టౌన్‌షిప్, మాదారం టౌన్‌షిప్‌లోని కమ్యూనిటీ హాల్‌లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. గోలేటిలోని కేంద్రాన్ని హైదరాబాద్ నుంచి వచ్చిన సింగరేణి సేవా సమితి సమన్వయకర్త డీఎస్ శివకుమార్ సందర్శించారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సేవా సమితి ద్వారా గోలేటిలో ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మాదారంలో మగ్గం, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సులు నిర్వహించారు. శిక్షణ పొందిన మహిళలు పరీక్షలకు హాజరయ్యారు. కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, సింగరేణి సేవా సమితి ఏరియా కోఆర్డినేటర్ అంజయ్య, శిక్షకులు శ్రీదేవి, రూప, శైలజ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.