
ఆసరా పింఛన్లు మంజూరు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు మంజూరు చేసి, ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న వారికి పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి థామస్ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఒంటరి మహిళలకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, అలాగే క్యాన్సర్, ఎయిడ్స్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.15వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. హామీ అమలు చేయకుంటే ఎన్నికల్లో బుద్ధి చెప్తామన్నారు. అలాగే ఎమ్మెల్యేల ఇళ్లు కూడా ముట్టడిస్తామని హె చ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో ఇన్‌చార్జి మల్లేశ్, జాతీయ ఉపాధ్యక్షుడు కేశవ్‌రావు, నాయకులు మూర్తి, శ్రీశైలం, విఠల్, మహేశ్, రాజయ్య, మల్లమ్మ, పెంటుబాయి, గోపాల్, మనోహర్, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.