
రేపు ప్రాదేశిక ఓటర్ల తుది జాబితా
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10న ప్రాదేశిక ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుదిజాబితా విడుదల చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణతో కలిసి అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 15 జెడ్పీటీసీ, 127 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 6న ముసాయిదా జాబితా ప్రదర్శించామని, అభ్యంతరాలు పరిశీలించి 10న తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
భూభారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, భూకొలతల అధికారి సోమేశ్వర్ రావుతో కలిసి తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు, మండల సర్వేయర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లతో భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం, రెవెన్యూ సదస్సులు, పోర్టల్ ద్వారా ఐదు వేల వరకు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తులు రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పదిరోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.