
పీజీసెట్‌లో 63వ ర్యాంకు
కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని రాస్పెల్లి గ్రామానికి చెందిన బొమ్మళ్ల రాజయ్య, ఇందిర దంపతుల కు మారుడు ప్రవీణ్ సో మవారం విడుదలైన పీజీసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ విభాగంలో 63వ ర్యాంక్ సాధించాడు. స్వగ్రామంలోని జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదివి 10 జీపీఏ సాధించాడు. ఇచ్చోడలోని టీజీ డబ్ల్యూఆర్‌జేసీలో ఇంటర్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని సిటి కళాశాలలో బీఎస్పీ పూర్తి చేశాడు. అనంతరం ఉచిత కోచింగ్ తీసుకుని పీజీ ప్రవేశ పరీక్షల్లో 63వ ర్యాంక్ సాధించాడు. ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల్లో చదువుకుని ర్యాంక్ సాధించడంపై ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.