
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీంచి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలో ని పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా పైరవీలు లేకుండా పోలీసుల సేవలు వినియోగించుకుంటూ, సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలని సూచించారు.
ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దు
ఆన్‌లైన్ ఆఫర్లు, వివిధ ప్రకటనల పేరుతో వచ్చే ఏపీకే ఫైల్స్, లింక్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్ద ని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సోమవారం ఒక ప్రకట నలో తెలిపారు. ఆన్‌లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లు అంటూ ఫేక్ లింక్స్‌తో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారని, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా సైబర్ మోసగాళ్లు ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి లింక్స్ ఇతరులకు ఫార్వర్డ్ చేయొద్దని, మోసపూరిత లింక్స్ గుర్తిస్తే 1930కు సమాచారం అందించాలని కోరారు. సైబర్ నేరాల నియంత్రణకు అప్రమత్తతే ప్రధాన ఆయుధమని, ప్రజలు మోసాల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.