
‘పెట్టుబడిదారులకే కేంద్రం వత్తాసు’
కెరమెరి: పెట్టుబడిదారులకే కేంద్ర ప్రభుత్వం వత్తా సు పలుకుతోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పాలకులు మారినా కార్మికులు, ఉద్యోగుల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ధనవంతుల కోసం ప్రభుత్వాలు చేసే నిర్ణయాల మూ లంగా కార్మికవర్గం ఇబ్బందుల పాలవుతోందని పే ర్కొన్నారు. వారికి కనీస ఉద్యోగ భద్రత, వేతనా లు, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఐసీడీఎస్, ఎండీఎం తదితర రంగాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. సమావేశంలో నాయకుడు కూటికల ఆనంద్‌రావు అంగనవాడీలు, ఆశ కార్యకర్తలు, ఐకేపీ వీవోఏలు ఉన్నారు.