
సమస్యలు పరిష్కరించాలి
కెరమెరి: మండలంలోని మడావిగూడ, చిన్నుగూడ గ్రామాల సమస్యలు పరిష్కరించాలని తెడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కోరారు. శనివారం ఆయా గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు రోడ్డు సౌకర్యం, కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కనీసం అంబులెన్స్ కూడా వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. గర్భిణులు, ప్ర జలకు అనారోగ్య సమస్యలెదురైతే నరకయాతన అనుభవించక తప్పదని పేర్కొన్నారు. గ తంలో పలుసార్లు అధికారులకు వినతిపత్రాచ్చినా ప్రయోజనం లేకపోయిందని ఆరోపించారు. వర్షం వస్తే మట్టి రోడ్లపై మోకాళ్ల లోతు బురద ఉంటుందని, అధికారులు వెంటనే స్పందించి రహదారులు నిర్మించాలని, కనీస వసతులు కల్పించాలని కోరారు.