
బీజేపీతోనే రాష్ట్ట్రంలో అభివృద్ధి
ఆసిఫాబాద్‌రూరల్/కాగజ్‌నగర్‌టౌన్: బీజేపీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత తొలిసారి బుధవారం ఆయన జిల్లాలో పర్యటించారు. ఉదయం కాగజ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు నివాసంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని తాటియా గార్డెన్స్‌లో బీజేపీ జిల్లాస్థాయి పార్టీ శ్రేణుల విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్, కుమురం భీం విగ్రహాలకు ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, మాజీ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావుతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా పంటల సాగకు ఉపయోగపడ డం లేదన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు ల పేరుతో రూ.లక్షల కోట్లు అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. 2014 నుంచి బీజేపీ సర్కారు రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్లు ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంలోనూ అక్రమాలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 19 నెలలవుతున్నా.. 19 రూపాయల అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలుగా ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఆదిలాబాద్ విమానశ్రయానికి స్థలం చూపిస్తే ఏడాదిలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు కాగజ్‌నగర్ పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి
ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. రూ.వందల కోట్లు మంజూరు చేసినా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేదని పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్, ధర్నాలతో రాష్ట్ర ప్రభుత్వం జీవో 49ను తాత్కాలికంగా నిలుపుదల చేసిందన్నారు. ఆయా సమావేశాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేశ్ నేత, జిల్లా మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మి, మాజీ ఎంపీపీ మల్లికార్జున్, నాయకులు ఆంజనేయులుగౌడ్, కృష్ణకుమారి, బోనగిరి సతీశ్, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
‘స్థానిక ఎన్నికల కోసమే 49 జీవో తాత్కాలిక నిలిపివేత
స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 49ను తాత్కాలికంగా నిలిపివేసిందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ తెలిపారు. జీవోను పూర్తిగా రద్దు చేయాలని, లేకుంటే కుమురం భీం స్ఫూర్తితో ముందుకెళ్తామన్నారు. 2014లో రాబందుల ఆవాసానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కన్జర్వేషన్ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నివేదిక పంపించిందని గుర్తు చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం రూ.108 కోట్ల నిధులు మంజూరు చేస్తే రూ.80 కోట్లు వేరే జిల్లాకు తరలించారని ఆరోపించారు.

బీజేపీతోనే రాష్ట్ట్రంలో అభివృద్ధి