
జయశంకర్ ఆశయ సాధనకు కృషి
ఆసిఫాబాద్: తెలంగాణ ఉద్యమకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో జయశంకర్ కీలకపాత్ర పోషించారని, సహాయకర్తగా విశేష సేవలందించారని గుర్తు చేశారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాన్ని ధారపోసిన మహనీయుడని కొనియాడారు. మహనీయుల స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సజీవన్, డీపీవో భిక్షపతి, డీటీవో రాంచందర్, జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు, కలెక్టరేట్ ఏవో కిరణ్, అధికారులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
వాంకిడి(ఆసిఫాబాద్): పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వాంకిడి మండలం ఖిరిడి గ్రామంలోని జెడ్పీ ఉన్న త పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. మధ్యా హ్న భోజనం నాణ్యత, వంటశాల, తరగతి గదులు, రిజిస్టర్లు, పరిసరాలు పరిశీలించారు. వర్షాకా లం దృష్ట్యా పారిశుద్ధ్యం లోపించకుండా చూసుకోవాలన్నారు. కట్టెల పొయ్యిపై కాకుండా గ్యాస్ స్టౌ వ్‌లపై ఆహారం తయారు చేయాలని, తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులు వినియోగించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి ఉదయ్‌బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే