
సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వండి
తిర్యాణి(ఆసిఫాబాద్): విద్యుత్ సమస్యలు ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆ శాఖ ఎస్‌ఈ శేషారావు సూచించారు. మండలంలోని దుగ్గాపూర్‌లో శుక్రవారం విద్యుత్ శాఖ– పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. రైతులకు విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించారు. పొలాల్లో స్తంభాలు వంగినా, తీగలు కిందికి జారినా వెంటనే సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. అంతకుముందు గిన్నెదరి సబ్‌స్టేషన్ నుంచి తిర్యాణి సబ్‌స్టేషన్ వరకు పూర్తయిన 33 కేవీ ఇంటర్ లాకింగ్ సిస్టంను ప్రారంభించారు. సరఫరా లో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇతర సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు ఇంటర్ లాకింగ్‌తో అవకాశం ఉంటుందని తెలిపారు. డీఈ వీరేశం, ఏడీఈలు శ్రీనివాస్, రాజేశ్వర్, ఏఈ రవీందర్, సబ్ ఇంజినీర్ సౌమ్య పాల్గొన్నారు.