
నగదు బదిలీ చేయాలి
చేప పిల్లలు సకాలంలో చెరువుల్లోకి వదిలితే 8, 9 నెలల్లో పెరిగి ఆ శించిన దిగుబడి వస్తుంది. అదును దాటితే ఆర్థికంగా నష్టపోతాం. చేపలు ఎదగపోవడంతోపాటు దిగుబడి కూడా తగ్గుతుంది. జూలైలో 50, 60 రోజుల చేపపిల్లలను జలాశయాల్లోకి వదిలితే ఫిబ్రవరి, మార్చి వరకు ఎదుగుతుంది. ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీకి బదులు సొసైటీలకు నగదు బదిలీ చేయాలి. నాణ్యమైన చేప పిల్లలు కొనుగోలు చేసి సకాలంలో చెరువులు, కుంటల్లోకి వదులుతాం. ఈ ఏడాది నుంచైనా నగదు బదిలీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. – ఎనుములె బిజ్జు, మత్స్యకారుడు, ఆసిఫాబాద్