
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి. రుతుపవనాల ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రైతన్నా.. జర భద్రం
రసాయనిక మందులు రైతులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. పిచికారీ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదిలాబాద్ కేవీకే శాస్త్రవేత్త రాజశేఖర్ సూచిస్తున్నారు.
రామ గుండం
లక్ష్మణ గుండం
భీమ గుండం
ప్రకృతి సోయగాలకు జిల్లా అటవీ ప్రాంతాలు నిలయంగా మారాయి. ప్రస్తుతం జోరుగా వర్షాలు కురుస్తుండటంతో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. లింగాపూర్ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సప్త గుండాలుగా పిలిచే (రామ, లక్ష్మణ, భీమ, సీత, సవతి, చిరుతల, బుగ్గ గుండం జలపాతాలు) మిట్టే జలపాతం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. అలాగే పెంచికల్‌పేట్ మండలం గుండెపల్లి అటవీ ప్రాంతంలోని దొద్దులాయి జలపాతం నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళను సంతరించుకుంది. జలపాతాలకు ఏటా సందర్శకుల తాకిడి పెరుగుతుండటంతో పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. – లింగాపూర్/పెంచికల్‌పేట్
రోడ్డు మరమ్మతులు షురూ
సిర్పూర్(టి) పట్టణంలోని ప్రధాన రహదారులకు మరమ్మతులు ప్రారంభమయ్యాయి. మరమ్మతులకు రూ.11 కోట్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు.
9లోu

వాతావరణం

వాతావరణం