సర్దుబాటు కొలిక్కి..! | - | Sakshi
Sakshi News home page

సర్దుబాటు కొలిక్కి..!

Jul 26 2025 8:48 AM | Updated on Jul 26 2025 9:28 AM

సర్దు

సర్దుబాటు కొలిక్కి..!

● విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా డిప్యూటేషన్లు ● జిల్లాలో 92 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు ● ఈ నెల 28 నుంచి కేటాయించిన స్థానాల్లో చేరాలని ఆదేశాలు

80 పాఠశాలలకు..

ప్రస్తుతం తెలుగు మీడియంలోని ఉపాధ్యాయులనే సర్దుబాటు చేస్తున్నారు. గతేడాది డీఎస్సీ నియామకాలు, పదోన్నతులు జరిగాయి. అయినా పలుచోట్ల ఖాళీలు ఉండటంతో 111 పాఠశాలలకు 108 మంది ఎస్జీటీలు, 28 మంది స్కూల్‌ అసిస్టెంట్లను సర్దుబాటు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఖాళీలను గుర్తించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 80 పాఠశాలలకు 92 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఇందులో ఎస్జీటీలు 58 మంది, స్కూల్‌ అసిస్టెంట్లు 34 మంది ఉన్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే ఆసిఫాబాద్‌లో 16 మంది, బెజ్జూర్‌ 4, చింతలమానెపల్లి 4, దహెగాం 6, జైనూర్‌ 3, కాగజ్‌నగర్‌ 11, కెరమెరి 11, కౌటాల 3, పెంచికల్‌పేట్‌ 4, రెబ్బెన 11, సిర్పూర్‌(టి) 8, తిర్యాణి 2, వాంకిడి 9 మందిని సర్దుబాటు చేశారు. వీరంతా ఈ నెల 28వ తేదీ నుంచి వారికి కేటాయించిన పాఠశాలలకు వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. 2025– 26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల సంఖ్య తుదిదశకు చేరుకోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు కల్పిస్తున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల పరిధిలో 721 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 39,246 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం పాఠశాలలో అదనంగా ఉన్నవారిని సమీపంలోని పాఠశాలలకు డిప్యూటేషన్ల ద్వారా సర్దుబాటు చేయాలని రా ష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ప్రభు త్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పూర్తికాక ముందు స్ప ష్టంగా ఖాళీల సంఖ్య తెలిసే అవకాశం లేదని సర్దుబాటు ప్రక్రియను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

397 ఉపాధ్యాయ ఖాళీలు

జిల్లాలోని 15 మండలాల పరిధిలో ప్రభుత్వ స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 721 ఉన్నాయి. ఆయా స్కూళ్లలో స్కూల్‌ గ్రేడ్‌ టీచర్లు, స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు 2,447 మంది పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 2,050 మంది ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 397 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. గతేడాది జీవో 317 ద్వారా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి 65 మంది స్పౌజ్‌(భార్య, భర్త) కేసుల్లో ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లారు. దీంతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. 1 నుంచి 10 మంది పిల్లలు ఉంటే ఒక ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలి. 11 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు టీచర్లు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు, 91 నుంచి 120 మంది ఉంటే నలుగురు, 121 నుంచి 150 మంది ఉంటే ఐదుగురు, 151 నుంచి 200 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఆరుగురు ఉపాధ్యాయులు ఉండాలి. అలాగే ఉన్నత పాఠశాలలో 200 ఉంటే సబ్జెక్టు ఒక్క ఉపాధ్యాయుడు, 201 నుంచి 250 మంది ఉంటే అదనంగా గణితం బోధించేందుకు ఇద్దరు టీచర్లకు కేటాయించాల్సి ఉంటుంది.

విద్యార్థులు నష్టపోకుండా చర్యలు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా 92 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశాం.

– యాదయ్య, డీఈవో

సర్దుబాటు కొలిక్కి..!1
1/1

సర్దుబాటు కొలిక్కి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement