
శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు పెంచాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు పెంచాలని డీఈవో యాద య్య అన్నారు. పీఎంశ్రీ అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో శుక్రవారం గణితం, సైన్స్ ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేష న్ మిషన్ సహకారంతో రూ.20లక్షలతో ని ర్మించిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు వినియోగించుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ వంటి సాంకేతిక రంగాలపై అవగాహన క ల్పించడం, ప్రయోగాలు చేయించడం ద్వారా విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదుగుతారన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఆధునిక ఆవిష్కర్తలుగా తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, రిసోర్స్‌పర్సన్లు అమీర్, శివకృష్ణ, ప్రిన్సిపాల్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.