
ప్రతీ ఆదివారం డీలర్లకు శిక్షణ
ఆసిఫాబాద్: ఇక నుంచి ప్రతీ ఆదివారం డీలర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో శుక్రవారం డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతీ డీలర్ శిక్షణ తరగతులకు హాజరై విషయ పరిజ్ఞానం పొందాలని సూచించారు.
నానో యూరియా వినియోగంపై శిక్షణ
జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో శుక్రవారం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమి టెడ్ ఆధ్వర్యంలో మండల వ్యవసాయాధికా రులు, ఏఈవోలకు నానో యూరియా, డీఏ పీ వాడకంపై ఒక రోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. సీనియర్ అగ్రనమిస్ట్ సుధాకర్‌రెడ్డి, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటె డ్ జోనల్ మేనేజర్ మనోజ్ కుమార్ యూరి యా, డీఏపీ వాడే విధానం, వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించారు. డీఏవో శ్రీనివాసరావు, కోరమాండల్ సేల్స్ ఆఫీసర్ శ్రావణ్, ఏడీలు మిలింద్‌కుమార్, వెంకటి, మనోహర్, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.