
జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ మున్సిపాలి టీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నం.60 ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్‌గా మారి 17 నెలలు గడుస్తున్నా కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనా లు చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని, లేనిపక్షంలో సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. సమ్మెకు మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ బాధ్య త వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు మాట్ల రాజయ్య, కార్యదర్శులు తోట సమ్మయ్య, నాయకులు బాలేశ్, ప్రభాకర్, శంకర్, ఇస్తారి, లక్ష్మి, బాలయ్య, పద్మ, శ్యామల, మల్లేశ్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.