
సమస్యల పరిష్కారానికి కృషి
చింతలమానెపల్లి(సిర్పూర్): ప్రజల సమస్యలు పరి ష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్మే పాల్వా యి హరీశ్‌బాబు అన్నారు. మండలంలోని బాలాజీ అనుకోడ, చింతలమానెపల్లి, ఖర్జెల్లి, దిందా, గూ డెం, కేతిని గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. బాలాజీఅనుకోడ పంచాయతీ పరిధిలోని పాల్వాయినగర్‌లో నూతన విద్యుత్‌లైన్ పనులు ప్రారంభించారు. అనంతరం ఖర్జెల్లి– గూడెం రహదారిని పరిశీలించారు. రహదారి మరమ్మతులకు రూ.కోటి 50లక్షలు మంజూరయ్యాని తెలిపారు. మట్టి మొ రంతో మరమ్మతులు చేపట్టొద్దని, కంకర వినియోగించాలని డీఈ లక్ష్మీనారాయణకు సూచించారు. దిందా వంతెన పరిశీలించి.. హైలెవల్ వంతెన ని ర్మాణానికి అనుమతులు వచ్చాయని తెలిపారు. వాతావరణం అనుకూలించగానే త్వరలో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అనంతరం పోడురైతులతో సమావేశమయ్యారు. భూముల వి షయంలో పోడు రైతులు సరైన ఒప్పందానికి రావా లని సూచించారు. గూడెం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులలో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. హెల్త్ సబ్‌సెంటర్ అద్దెభవనంలో ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆ యన దృష్టికి తీసుకెళ్లారు. గూడెం, సమీప గ్రామాల కు ఉపయోగపడేలా పీహెచ్‌సీ మంజూరుకు ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇచ్చారు. గూడెం ఉన్నత పాఠశాలలో 9, 10 వతరగతులు అప్‌గ్రేడ్ చేయాలని డీఈవోతో ఫోన్‌లో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్న గూడెం మాజీ సర్పంచ్ పూల్‌చంద్ జైశ్వాల్‌ను పరామర్శించారు. చింతలమానెపల్లిలో పలువురు పార్టీలో చేరగా.. కండువా కప్పి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజేందర్‌గౌడ్, చింతలమానెపల్లి, కౌటాల మండలాల అధ్యక్షులు డోకె రామన్న, కుంచాల విజయ్, నాయకులు మల్లయ్య, చౌదరి నానయ్య, తుకారాం, సుధాకర్, చౌదరి రంగన్న తదితరులు పాల్గొన్నారు.