
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నిర్మల్‌టౌన్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెంది న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థా నికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు జిల్లా పద్మశాలి సంఘం సమన్వయకర్త, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ కోకన్వీనర్ ఆడెపు భూమన్న (61) సోమవారం రాత్రి బస్టాండ్ సమీపంలో కాలినడకతో రోడ్డు డివైడర్‌ను దాటే క్రమంలో ఎదురుగా వచ్చిన బైక్ ఢీ కొట్టింది. తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.