
వైఎస్సార్ ఆశయాలు నెరవేరుస్తాం
ఆసిఫాబాద్‌అర్బన్: బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసిన దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేరుస్తామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యాంనాయక్ అన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయ న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్యాంనాయక్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంతో పాటు వైద్యరంగంలో విప్లవాత్మక నిర్ణయాలను వైఎస్సార్ అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆయన కలలను నిజం చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రాపర్తి మురళి, నిజాం, లచ్చన్న, వినోద్, విశ్వనాథ్, బాలేష్ తదితరులు పాల్గొన్నారు.