
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
ఆసిఫాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్క రూ మొక్కలు నాటాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భా గంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో సో మవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్‌డీవో దత్తారావు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రహదారులకు ఇరువైపులా, ప్ర భుత్వ భూములు, కార్యాలయాలు, విద్యాసంస్థల ఆవరణ, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాల ని సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు.