
మత్తుకు బానిస కావొద్దు
కాగజ్‌నగర్‌రూరల్: యువత మత్తుకు బానిస కావొద్దని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాగజ్‌నగర్ మండలం బురదగూడ గ్రామంలో సోమవారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిర్మూలనకు ప్రజలు, యువత, విద్యార్థులు సహకరించాలని కోరారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల బారినపడి యువత జీవితాలు కోల్పోతున్నారన్నారు. ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని, వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి, చెడులు వివరించి, క్రమశిక్షణ నేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం, రూరల్ సీఐ శ్రీనివాస్‌రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిర్భయంగా సేవలు వినియోగించుకోవాలి
ఆసిఫాబాధ్: జిల్లా ప్రజలు నిర్భయంగా పోలీసుల సేవలు వినియోగించుకోవాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిస్థితి, పరిష్కారానికి సూచనలు ఇచ్చా రు. ఆయన మాట్లాడుతూ ప్రజలు మూడో వ్యక్తి ప్ర మేయం లేకుండా పోలీస్ సేవలు వినియోగించుకో వాలని సూచించారు. చట్టప్రకారం సమస్యలు పరి ష్కరించేందుకు పోలీసులు పనిచేస్తారని తెలిపారు.
ఎస్పీ కాంతిలాల్ పాటిల్