
త్యాగధనుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ
ఆసిఫాబాద్‌అర్బన్: సమైఖ్య భారతావని కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ త్యాగం మరువలేనిదని సీనియర్ న్యాయవాది పంచదార దీపక్‌రావ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శ్యామప్రసాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాటూరి జయరాజ్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు శ్యాంప్రసాద్ ఆశయ సాధనకు అంకిత భావంతో ముందుకు సాగాలన్నారు. ఒకేదేశం, ఒకే ప్రధాని, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం ఆయన ఆశయమని, అది ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోనే అమలు చేయడం జరిగిందన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ముఖర్జీ తప్పుపట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వినోద్, నాయకులు ఎగ్రస్ శ్రీకాంత్, మేకర్తి కోటేశ్, రాపర్తి పోశన్న, వవాల్కర్ పెంటన్న, తదితరులు పాల్గొన్నారు.
కౌటాల: కేంద్ర మాజీ మంత్రి, జన్‌సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను సాధించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. ఆదివారం కౌటాలలో ముఖర్జీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్‌సంఘ్ స్థాపించి ప్రజల కోసం పోరాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బండి రాజేందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు కుంచాల విజయ్, మాజీ ఎంపీటీసీ దుర్గం మోతీరాం, నాయకులు రవి, కమలాకర్, భూమయ్య, మిథున్, నాగయ్య, మధు, తదితరులు పాల్గొన్నారు.