
మొక్కలతోనే పర్యావరణ సంరక్షణ
ఆసిఫాబాద్‌రూరల్: మొక్కల పెంపకంతోనే పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని గోవింద్‌పూర్ గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భా గస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాలుష్యం నియంత్రించేందుకు పర్యావరణ రక్షణకు పాటుపడాలని సూచించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. వంటలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్, ఎంఈవో సుభా ష్, ఏపీవో బుచ్చయ్య, ఎంపీవో మౌనిక, ఏఈ సంజయ్, పంచాయతీ కార్యదర్శి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.