
విద్యుత్ కోతలపై రైతుల ధర్నా
కాగజ్‌నగర్‌టౌన్: మండలంలోని బురదగూ డ, వంజిరి, సీఆర్‌నగర్, అంకుసాపూర్, నార్లపూర్ గ్రామాలకు మూడు నెలలుగా విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారని సోమవారం పట్టణంలోని ఎన్‌పీడీసీఎల్ డివిజన్ కార్యాల యం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. వర్షాకాలంలో విషపురుగులు తిరిగే అవకాశం ఉందని, కరెంట్ లేకపోవడంతో చీకట్లో ప్రమాదా లకు ఆస్కారం ఉందని ఆవేదన వ్యక్తం చేశా రు. ఏఈ, లైన్‌మెన్లకు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, సమస్య పరిష్కరించని పక్షంలో మళ్లీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగూరె శ్యాంరావు, కొట్రగే నాందేవ్, గౌత్రే గోపాల్, మురళీ, తిరుపతి, పొశెట్టి తదితరులు పాల్గొన్నారు.
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
కాగజ్‌నగర్‌రూరల్: అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆ శాఖ ఎస్‌ఈ శేషాగిరి రావు అన్నారు. పట్టణంలోని డివిజన్ కార్యాలయాన్ని సోమవారం సందర్శించారు. సమస్యలు ఎదురైతే టోల్‌ఫ్రీ నం.1912కు ఫోన్ చేయాలని సూచించారు. అనంతరం బురదగూడ, వంజిరి, సీఆర్‌నగర్, అంకుసాపూర్, నార్లపూర్ గ్రామాల రైతులు ఆయనకు వినతిపత్రం అందించారు.