
పథకాల అమలుకు చర్యలు
ఆసిఫాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో గృహజ్యోతి పథకంలో 73,475 లబ్ధి పొందారు. ఇంకా దరఖాస్తులు పరిశీలిస్తున్నాం. భూ భార తి రెవెన్యూ సదస్సుల్లో నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయి. పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. సీఎంఆర్ సమస్యలతో జిల్లా నుంచి 10 వేల టన్నుల ధాన్యాన్ని పెద్దపల్లికి పంపించాం. కొన్ని ఇందిరమ్మ ఇళ్లు కోర్ ఏరియాలో ఉండడంతో అటవీశాఖ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం. పర్యాటక రంగ అభివృద్ధి కోసం రూ.4.99 కోట్లతో పనులు చేపడుతున్నాం. జలపాతాల అభివృద్ధికి డీపీఆర్ తయారు చేస్తున్నాం. – వెంకటేశ్ దోత్రే, కుమురంభీం జిల్లా కలెక్టర్